బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో ఆరంభమైంది. ట్రేడింగ్ ఆరంభంలోనే బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 147 పాయింట్లు పుంజుకుని 18,373 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా 45 పాయింట్లు బలపడి, 5,523 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.ఆసియా స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధి బాటలో కొనసాగుతోంది.
ఇంకా మెటల్, రియాల్టీ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. మరోవైపు మదుపుదారులు సైతం కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపడం ద్వారా సెన్సెక్స్, నిఫ్టీలు పురోగమనం వైపు ర్యాలీని పయనింపజేస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఇకపోతే.. హిందాల్కో, జిందాల్, టాటా స్టీల, ఆకృతి సిటీ, శోభా దేవ్, హెచ్‌డీఐఎల్ వంటి కంపెనీలు లాభాల బాటలో కొనసాగుతున్నాయి.