భారీ లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ వృద్ధి!
బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ఆరంభం నుంచే పురోగమనం వైపు కొనసాగుతున్న సెన్సెక్స్, ఉదయం 11.30 గంటల ప్రాంతంలో 221 పాయింట్లు భారీగా వృద్ధి చెంది, 18,442 పాయింట్ల మార్కును తాకింది. ఇంకా నిఫ్టీ కూడా 67 పాయింట్ల లాభంతో 5,546 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
అమెరికా, ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్లు లాభాలను ఆర్జించడం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఇంకా దేశీయ రియాల్టీ, మెటల్, బ్యాంకింగ్ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు కొనసాగుతోంది. దీనికితోడు మదుపు దారులు సైతం లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపడం బాంబే స్టాక్ మార్కెట్ భారీ వృద్ధికి ప్రధాన కారణమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.