ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » లాభాల్లో స్టాక్ మార్కెట్ : భారీగా వృద్ధి చెందిన సెన్సెక్స్! (Sensex | Bombay Stock Market | Gains | Index | BSE | NSE | Trade | Shares| Investors)
లాభాల్లో స్టాక్ మార్కెట్ : భారీగా వృద్ధి చెందిన సెన్సెక్స్!
బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు కొనసాగుతున్న సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 250 పాయింట్లు భారీగా పుంజుకుని, 18,471 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా 79 పాయింట్లు బలపడి, 5,500 (5,558) పాయింట్ల మార్కును దాటింది.
అమెరికా నిరుద్యోగ సమస్యకు బ్రేక్ పడే దిశగా.. గత ఏడాది కంటే ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అమెరికా ప్రకటించడం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఇంకా దేశీయ వాటాల ట్రేడింగ్ ఆశాజనకంగా కొనసాగడం బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధికి ప్రధాన కారణమైందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.