ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » విదేశీ మార్కెట్ల ప్రభావం: భారీగా వృద్ధి చెందిన సెన్సెక్స్! (Sensex | Bombay Stock Market | Gains | Index | BSE | NSE | Trade | Shares| Investors)
విదేశీ మార్కెట్ల ప్రభావం: భారీగా వృద్ధి చెందిన సెన్సెక్స్!
బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా లాభపడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు కొనసాగుతున్న సెన్సెక్స్, మధ్యాహ్నం 334 పాయింట్లు భారీగా లాభపడి, 18,556 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా 98 పాయింట్లు పుంజుకుని, 5,578 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
అమెరికా, ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్లు లాభాలను ఆర్జించడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధిని నమోదు చేసుకుంది. ఇంకా దేశీయ మెటల్, బ్యాంకింగ్, ఐటీ, టెక్, రియాల్టీ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు కొనసాగుతోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.