ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » స్టాక్ మార్కెట్: మళ్లీ పుంజుకున్న సెన్సెక్స్ సూచీ (Sensex | Pulls back | Sterlite | SBI | Wipro up | Stocks)
ముంబై స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ప్రారంభ ట్రేడింగ్‌లో ఆశాజనకంగా ప్రారంభమైన ట్రేడింగ్.. మధ్యాహ్నం 11 గంటలకు వంద పాయింట్ల మేరకు నష్టపోయింది. ఆ తర్వాత 12 గంటలకు మళ్లీ పుంజుకుంది. ఫలితంగా 24 పాయింట్లు లాభపడి 18,699 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ సైతం మూడు పాయింట్ల వృద్ధితో 5,600 వద్ద ఉంది.
ఆరంభంలో నష్టాలను చవిచూసిన అన్ని కంపెనీల షేర్లు మార్కెట్ బలపడటంతో తిరిగి పుంజుకున్నాయి. ప్రధానంగా ఆరోగ్య రంగ షేర్లు 0.71 శాతం మేరకు లాభపడ్డాయి. వీటితో పాటు.. స్టెరిలైట్, ఎస్‌బీఐ, విప్రో, టీసీఎస్ కంపెనీల షేర్లు కూడా వృద్ధిబాటలో పయనిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్ షేర్లు ప్రాఫిట్ బుకింగ్స్‌లో ముందుకు సాగుతున్నాయి.