స్టాక్ మార్కెట్: 17 పాయింట్లను నష్టపోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ మధ్నాహ్నం ఒంటి గంట సమయంలో 17 పాయింట్లను కోల్పోయింది. ఒక దశలో వంద పాయింట్ల మేరకు పతనమైన సెన్సెక్స్ సూచీ ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది. అయితే, మధ్యాహ్నం ఒంటి గంటకు 17 పాయంట్లను కోల్పోయి 18627 వద్ద కొనసాగుతోంది. అలాగే, నిఫ్టీ రెండు పాయింట్ల పెరుగుదలతో 5606 వద్ద ఉంది.
ఈ ట్రేడింగ్‌లో టాటా పవర్, ఎస్.బి.ఐ, మార్గ్, టాటా స్టీల్, మిడ్‌ఫీల్డ్ ఇండస్ట్రీస్, పిరమల్ హెల్త్‌కేర్ సంస్థల షేర్లు లాభాల బాటలో పయనిస్తుండగా, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీల షేర్లు నష్టాలను చవి చూస్తున్నాయి.