సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » 21 పాయింట్ల వృద్ధితో ముగిసిన సెన్సెక్స్ సూచీ (Sensex | Ends higher | Global weakness | Business | BSE | Nifty)
Bookmark and Share Feedback Print
 
ముంబై స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ బుధవారం 21 పాయింట్ల వృద్ధితో ముగిసింది. ఫలితంగా ట్రేడింగ్ ముగిసే సమయానికి 18,666 వద్ద స్థిరపడింది. అయితే, నిఫ్టీ మాత్రం కేవలం మూడు పాయింట్లు లాభపడి 5607 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లు బలహీనపడటం వల్ల స్టాక్ మార్కెట్‌ సానుకూలంగా ముగిసింది.

ట్రేడింగ్ ఆద్యంతం ఎఫ్ఎంసిజి, మూలాధన వస్తువులు, ఆయిల్, గ్యాస్ స్టాక్స్‌‌లు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా ఐటీసీ 1.21 శాతం, ఎల్ అండ్ టి 0.63 శాతం, ఆర్ఐఎల్ 0.19 శాతం చొప్పున కోల్పోయాయి. ఐటీ, హెల్త్‌కేర్, రియాల్టీ, మెటల్ కంపెనీల షేర్లు పెరిగాయి. ఫలితంగా స్టెరిలైట్, టీసీఎస్, జిందాల్ స్టీల్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు షేర్లు లాభపడ్డాయి.

టెలికామ్ కంపెనీలైన భారతి 2.52 శాతం షేర్లు, రిలయన్స్ కమ్యూనికేషన్‌లు 0.98 శాతం మేరకు లాభపడ్డాయి. సన్ ఫార్మా షేర్లలో కూడా పెరుగదల కనిపించింది. సీఎల్ఎక్స్ మిడ్‌క్యాప్ 0.17 శాతం పెరుగుదల కనిపించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.