ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » బాంబే స్టాక్ మార్కెట్: 11 వారాల గరిష్ఠ స్థాయిని చేరిన సెన్సెక్స్! (Stock Market | Sensex | Nifty | Business | bse)
బాంబే స్టాక్ మార్కెట్: 11 వారాల గరిష్ఠ స్థాయిని చేరిన సెన్సెక్స్!
శుక్రవారం, 27 జనవరి 2012( 17:34 IST )
బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు ర్యాలీని ముగించింది. తద్వారా సెన్సెక్స్ సూచీ 157 పాయింట్లు లాభపడి, 17,234 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా 47 పాయింట్లు పుంజుకుని 5,205 పాయింట్ల వద్ద స్థిరపడింది. దీంతో సెన్సెక్స్ వరుసగా ఆరో రోజు లాభాలతో ముగిసింది.
దేశీయ ఆయిల్, గ్యాస్, కన్జూమర్ డూరబుల్స్, మెటల్ షేర్లు లాభపడటంతో పాటు మదుపుదారులు సైతం కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపడంతో స్టాక్ మార్కెట్ వృద్ధిని నమోదు చేసుకుంది. ఇంకా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ఆశాజనక సంకేతాలతో బాంబే స్టాక్ మార్కెట్ లాభపడిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, హిందూస్థాన్ జింక్, వీఐపీ ఇండస్ట్రీస్, గీతాంజలి జెమ్స్, వీఐపీ ఇండస్ట్రీస్, బ్లూ స్టార్ వంటి కంపెనీలు లాభపడగా, డీఎల్ఎఫ్, బజాజ్ ఆటో, భెల్, హీరో మోటార్ కార్పొరేషన్, జిందాల్ స్టీల్ వంటి సంస్థలు నష్టపోయాయి.