ప్రధాన పేజి   వార్తలు  ఆర్థికం  వార్తలు
 
'ఇండియన్' ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక
అపరిష్కృత డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఉద్యోగులు బుధవారం మెరుపు సమ్మెకు దిగారు. దేశ వ్యాప్తంగా ఒక్కసారి 12 వేల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనడంతో విమానరాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, ముంబై ప్రాంతాల్లో విమాన సేవలు పూర్తిగా స్తంభించాయి. పలు సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ..పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, సమ్మెను ఉపసంహరించుకోని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే.. ఇప్పటికే 23 మందికి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్టు మంత్రి పటేల్ వెల్లడించారు. దాదాపు 40 శాతం సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగిందని, ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమ్మె ఇలాగే కొనసాగిన పక్షంలో లాకౌట్ చేయాలని కేంద్రం యోచిస్తున్నట్టు ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
మరిన్ని
పారిశ్రామిక ఉత్పత్తి వృద్దిపై చిదంబరం హర్షం
ఎయిర్ డెక్కన్ టికెట్ రేట్ల పెంచాలని విజయ్ మాల్య నిర్ణయం
వచ్చేనెలలో ఐపీఐ పైప్‌లైన్ ఒప్పందంపై సంతకాలు
మత్స్య కేంద్రాల అభివృద్ధికి రూ. 75 కోట్లు : ప్రసాద్
బి.ఎన్‌.ఎన్‌.ఎల్‌ తాజా ఆఫర్‌ రూ.1.75కే ఐఎస్డీ కాల్
సేవాలోపం: మలేసియా ఎయిర్‌లైన్స్‌కు జరిమానా