గత మూడు ఏళ్లుగా నిలకడగానున్న క్రెడిట్ కార్డుల వడ్డీ రెట్లు ఇకనుంచి పెరగనున్నాయి. క్రితం వరకు 2.90 శాతం నుండి 2.95 వరకు ఉన్న వడ్డీ రేట్లును పెంచాలని బ్యాంకులు నిర్ణయించాయి. అత్యధిక క్రెడిట్ కార్డు ఖాతదారులు గల ఐసిఐసిఐ బ్యాంకు 2.99 శాతం నుండి 3.15 శాతం వరకు వడ్డీని, రెండవ స్థానంలోనున్నా యస్‌బిఐ 2.99 శాతం నుండి 3.10 శాతం వరకు వడ్డీని పెంచాయి.
సిటీ బ్యాంకు, సన్‌చారత్ మరియు ఎబిఎన్ అమ్రె బ్యాంకులు 3.15 శాతం నుండి 3.20 శాతం వరకు వడ్డీని పెంచవచ్చును. 24 మిలియన్ రూపాయల వరకు క్రెడిట్ కార్డు మార్కెట్ ఉంది. క్రెడిట్ కార్డు వినియోగం ఏటా 25 శాతం వరకు పెరుగుతుంది. పెరిగిన వడ్డీ రెట్లు క్రెడిట్ కార్డు వినియోగదారునిపై ఎంతమాత్రం ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.
|