చైనా ఆటోమొబైల్ పరిశ్రమల ఉత్పత్తి తొమ్మిది మిలియన్ యూనిట్లకు చేరింది. ఆ దేశ కనిష్ట లక్ష్యమైన 8.5 మిలియన్ యూనిట్లను చైనా అధికమించింది. అయితే.. ఈ లక్ష్యాన్ని వచ్చే 2010 నాటికి చేరాలని తొలుత భావించారు. మూడేళ్లలోపే ఈ అభివృద్దిని సాధించామని చైనా పారిశ్రామిక సంస్థ ఉపాధ్యక్షుడు జాంగ్ జీయు తెలిపారు.
గత ఐదేళ్లుగా చైనా ఆటోమొబైల్ రంగంలో పటిష్టమైన అభివృద్దిని సాధించిందని, వార్షిక సగటు 26 శాతం నమోదయిందని జాంగ్ పేర్కొన్నారు. చైనా ఈ ఏడాది ప్రధమార్థానికి 4.5 మిలియన్‌ల వాహనాలను ఉత్పత్తి చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 22.4 శాతం ఎక్కువనీ, అమ్మకాలు 4.4 శాతంనుండి 23.3 మిలియన్‌లు పెరిగాయని చైనా ఆటోమొబైల్ తయారీదారుల సంఘం తెలిపింది.
|