గ్యాస్ పైపులైను ప్రాజెక్టులో తమ షరతులకు భారత్ అంగీకరించని పక్షంలో పాకిస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంటామని ఇరాన్ తేల్చి చెప్పింది. పాకిస్తాన్ మార్గంలో సరఫరా కోసం చేపట్టే పైప్‌లైన్ నిర్మాణ వ్యయాన్ని భరించే విషయంలో ఆ దేశంతో భారత్ ఓ అంగీకారానికిరాని పక్షంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు కోసం పాకిస్థాన్‌తో మాత్రమే ఒప్పందం కుదుర్చుకోగలమని హెచ్చరించింది.
దీనికి సంబంధించి ఆ రెండు దేశాలు చర్చలు జరుపుతుండగా, భారత్ ప్రతినిధులు మాత్రం వాటికి దూరంగా ఉన్న నేపధ్యంలో ఇరాన్ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. మూడు దేశాల మధ్య ఈ ఒప్పందం జరగాలని తాము కోరుకుంటుండగా, అది జరగని పక్షంలో పాకిస్థాన్‌తో మాత్రమే ఒప్పందం చేసుకోగలమని చెప్పారు. ఇరాన్-పాకిస్తాన్-భారత్‌ల మీదుగా.. గ్యాస్ పైపు లైను నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెల్సిందే.
|