యూటీఐ మ్యూచువల్ ఫండ్ లిమిటెడ్ స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంక్ సంయుక్తంగా దుబాయ్‌లో న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ)ను ప్రారంభించనుంది. దీనికోసం యూటీఐ, స్టాండర్డ్ ఛార్టెడ్‌లు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఎన్ఎఫ్ఓ సేవలకు యూటీఐ దిర్హం చెక్‌లను వినియోగిస్తుందని విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసింది.
గల్ఫ్ దేశాల్లో గల భారతీయులకు ఈ విధానం ఉపకరిస్తుందని ఆ ప్రకటన వివరాలు వెల్లడించాయి. అంతేకాకుండా దుబాయ్‌లో గల్ఫ్ దేశాల్లో గృహాలు లేని సింగిల్ స్టేటస్‌ను కలిగి ఉన్న వారు ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని యాటీఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ జైదీప్ భట్టాచార్య చెప్పారు. దుబాయ్‌లో మరిన్ని పథకాలను అమలు చేసే దిశగా యూటీఐ సన్నాహాలు చేస్తోందని అన్నారు.
|