ప్రధాన పేజి   వార్తలు > ఆర్థికం > వార్తలు
 
విద్యుత్ ఉత్పత్తితో రూ.600 కోట్ల ఆదా: లాలూ
భారతీయ రైల్వే శాఖ విద్యుత్‌ ఉత్పత్తి చేసుకుంటే ఏడాదికి రూ.600 కోట్ల రూపాయల మేరకు ఆదా చేసుకోవచ్చని ఆ శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇందులోభాగంగా ఉత్తర బీహార్‌లోని నబీనగర్‌లో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ఎన్‌టీపీసీతో కలసి ఒక అహగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.

ఢిల్లీలోని రైల్‌ భవన్‌‌లో మంగళవారం జరిగిన సమావేశంలో రైల్వే శాఖ మంత్రి లాలు ప్రసాద్‌ యాదవ్‌, వ్యిదుత్‌ శాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేల సమక్షంలో జాయింట్‌ వెంచర్‌ ఒప్పందంపై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. భారతీయ రైల్వే స్వయంగా విద్యుత్‌ ఉత్పత్తి చేసుకున్నట్లయితే ఏడాదికి 400 కోట్ల నుంచి 600 కోట్ల రూపాయలు ఆదా చేసుకోగలుగుతుందని మంత్రి లాలూ ప్రసాద్ ఈ సందర్భంగా అన్నారు.

ఈ ప్లాంట్‌ నిర్మాణ వ్యయం 1605 కోట్ల రూపాయలని, ఇందులో ఎన్‌టిపిసికి 74 శాతం, భారత రైల్వేకు 26 శాతం వాటాలుంటాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 90 శాతం రైల్వే శాఖకు, పది శాతం రాష్ట్రానికి అందిస్తామని లాలూ చెప్పారు.
మరిన్ని
కంట్రోల్ ఛార్టింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించనున్న రైల్వేస్
పునఃప్రారంభమైన 'విమల్' వస్త్రప్రపంచం
పైప్‌లైన్ ప్రాజెక్ట్: టర్క్‌మెకిస్థాన్‌కు భారత్ పిలుపు
ముంబై విమానశ్రయ కాంట్రాక్టు పనులు ఎల్ అండ్ టీ వశం
పెరిగిన టీవీఎస్ మోటార్ సైకిల్ విక్రయాలు
నావీ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వీడియోకాన్ సన్నాహాలు