ప్రముఖ పుణ్యస్థలమైన తిరుపతిలో ప్రారంభమైన సన్ ఎఫ్.ఎం రేడియో ఇప్పటి తెలుగు శ్రోతలను అమితంగా ఆకట్టుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.ఈ ఎఫ్.ఎం తాజాగా విజయవాడలో రేడియో స్టేషన్‌ను ప్రారంభించింది. ఎస్ ఎఫ్ఎమ్ పేరుతో 93.5 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీ వద్ద విజయవాడ శ్రోతలకు ఇది అందుబాటులో ఉంటుందని కళ్ రేడియో లిమిటెడ్ పేర్కొంది. దీంతో సన్ ఎఫ్.ఎం నెట్‌వర్క్ జాబితాలో 17వ ఎఫ్ఎమ్ స్టేషన్ చేరింది.
సన్‌కు ఇప్పటికే చెన్నై, కోయంబత్తూరు, తిరునల్వేలి, విశాఖపట్నం, బెంగుళూరు, హైదరాబాద్, జైపూర్, భువనేశ్వర్, తిరుపతి, మదురై, ట్యుటికోరిన్, లక్నో, భోపాల్, పాండిచ్చేరి, కాలికట్, ఇండోర్ తదితర ప్రాంతాల్లో ఎఫ్ఎమ్ స్టేషన్లు ఉన్నాయి. దేశంలో మొత్తం 45 ఎఫ్ఎమ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకునేందుకు సన్‌కు లైసెన్సు ఉంది. మిగిలిన 28 స్టేషన్లను కూడా ప్రారంభిస్తే దేశంలోనే అతిపెద్ద ఎఫ్ఎమ్ నెట్‌వర్క్‌గా సన్ గ్రూపు అవతరించనుంది.
|