యాడ్స్ ధరలను త్వరలో పెంచనున్నట్ల ప్రముఖ టీవీ ఛానెళ్ సన్‌టీవీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రకటించింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రసారాలను నిర్వహిస్తున్న సన్ నెట్‌వర్క్ సంస్థ సోమవారం ఈ మేరకు ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది.
ముంబాయిలో సోమవారం విలేకరుల సమావేశంలో సన్‌టీవీ నెట్‌వర్క్ సంస్థ అధినేత కళానిధి మారన్ మాట్లాడుతూ తాము పెంచనున్న అడ్వర్టైజ్‌మెంట్ ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయని చెప్పారు. అలాగే కంటెంట్ ప్రొడ్యూసర్స్ వద్ద ఫిబ్రవరి 15 నుంచి వసూళ్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ధరల వివరాలను తెలుపుతూ తమిళ ఛానెళ్ అడ్వర్టైజ్‌మెంట్ ధరలు 10 నుంచి 21 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపారు. అలాగే తెలుగు ఛానెళ్ (జెమినీ టీవీ)కు 15 శాతం, కన్నడ ఛానెళ్ (ఉదయ టీవీ)కు 10 నుంచి 20 శాతం వరకు, మలయాళం ఛానెళ్ (సూర్య టీవీ)కు 3 నుంచి 13 శాతం వరకు పెంచనున్నట్లు చెప్పారు.
|