ప్రధాన పేజి   వార్తలు > ఆర్థికం > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
యునైటెడ్ ఫాస్ఫరస్ పాలైన కొలంబియా కంపెనీ
కొలంబియాకు చెందిన ఏవో ఫార్మ్స్ కంపెనీలో 100 శాతం వాటాలను యునైటెడ్ ఫాస్ఫరస్ హస్తగతం చేసుకుంది. సస్య రక్షణ పరిశ్రమలో జెనెరిక్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్న ఏవో ఫార్మ్స్ కంపెనీకి పూర్తిగా ధనాన్ని చెల్లించడం ద్వారా యునైటెడ్ ఫాస్ఫరస్ వాటాలను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ సీఎమ్‌డీ రాజు ష్రాష్ మీడియాతో మాట్లాడుతూ ఏవోఫార్మ్స్‌లో నూరు శాతం వాటాలను హస్తగతం చేసుకోవడంతో కంపెనీ టర్నోవర్‌కు ఒకటి నుంచి రెండు శాతం వరకు అదనపు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

కొలంబియా మార్కెట్‌లో ఏవో ఫార్మ్స్‌కు మంచి చోటు ఉందని వెల్లడించారు. అలాగే ఏవో ఫార్మ్స్ ఉత్తమమైన శాస్త్రీయతను కలిగి ఉందని పేర్కొన్నారు. పై రెండు అంశాలు తమకు కొలంబియా మార్కెట్‌లో సామర్థ్యమైన చోదక శక్తిని అందిస్తాయని రాజు ష్రాఫ్ తెలిపారు.
మరిన్ని
అమూల్ మాచో భారీ విస్తరణ
భారీ స్థాయిలో సింథటిక్ రబ్బర్ వినియోగం
పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో సెంచురీ ప్లై ప్లాంటులు
ఆయిల్ ఇండియా లిమిటెడ్ స్వర్ణోత్సవాలు
యూటీవీలో వాటాలు పెంచుకోనున్న వాల్ట్ డిస్నీ
వక్రాంజీలో పెరిగిన మెర్రిల్ల్ లైన్స్‌చ్ వాటాలు