దేశ వ్యాప్తంగా 53 కొత్త రైళ్లతో పాటు.. ఇపుడున్న గరీభ్‌రథ్ రైళ్ళకు అదనంగా మరో పది గరీభ్‌రథ్ రైళ్లు తమ సేవలు అందిస్తాయని కేంద్ర మంత్రి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో విద్యను అభ్యశిస్తూ.. తమ సొంత ప్రాంతాలకు వచ్చే 12వ తరగతిలోపు విద్యార్థులకు ప్రయాణ చార్జీల్లో రాయితీని కల్పిస్తామని లాలూ ప్రకటించారు. అశోకచక్ర పురస్కార గ్రహీతలకు ,డెకరేటెడ్ సైనికులకు చార్జీల్లో ప్రత్యేక రాయితీలు కల్పిస్తామన్నారు.
అన్ని రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద కాపలా వ్యక్తులను నియమించనున్నట్టు తెలిపారు. ఆర్ఫీఎఫ్ సిబ్బిందికి అధునాతన ఆయుధ సంపత్తిని కల్పించనున్నట్టు చెప్పారు. డిగ్రీ లోపు మహిళా విద్యార్థులకు ఉచిత సీజన్ టిక్కెట్లను అందజేస్తామన్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెడతామన్నారు. బీవోటీ ప్రాజెక్టులకు తొలిసారిగా రైల్వే శాఖ అమోదం. 16,500 పురాతన రైల్వే ట్రాక్‌లను ప్రస్తుత సంవత్సరాంతంలోగా నేటి సామర్థ్య ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. కేరళ రాష్ట్రంలో కొత్తగా రైలు బోగీల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పుతామని చెప్పారు.
|