తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు నైపుణాభివృద్ధిని సాధించే నిమిత్తం నాలెడ్జ్ మిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జ్యోతి సీఎన్‌సీకి చెందిన ప్రపంచ స్థాయి తయారీ, పరిశోధన మరియు రూపకల్పన అభివృద్ధి కేంద్రాన్ని మోడీ ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఆటోమొబైల్ రంగం కోసం ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్) ని నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
భారీ స్థాయి ఆటోమొబైల్ పరికరాల తయారీదారులు నెలకొల్పే ఆటోమొబైల్ కేంద్రాలతో ఆటోమొబైల్ హబ్‌గా రాజ్‌కోట్ అవతరిస్తుందని ఆయన అన్నారు. తయారీ రంగానికి కీలకమైన మద్దతును ఇవ్వడంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థకు మెషిన్ టూల్ పరిశ్రమ వెన్నెముక వంటిదని నరేంద్ర మోడీ తెలిపారు.
|