కార్యకలాపాల విస్తరణలో భాగంగా రూ.350 కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని హిందూజా ఫౌండ్రీస్ తెలిపింది. హిందూజా ఫౌండ్రీస్‌ను గతంలో ఎన్నూర్ ఫౌండ్రీస్‌గా పిలిచేవారు. హైదరాబాద్, చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లలో హిందూజా ఫౌండ్రీస్‌కు కర్మాగారాలు ఉన్నాయి. తమ కంపెనీకి వచ్చిన లాభాల్లో 51 శాతం వాటా అశోక్ లేలాండ్ నుంచి వచ్చిందని హిందూజా ఫౌండ్రీస్ ఎండీ వి.మహదేవన్ చెప్పారు.
కొత్తగా తమ కార్యకలపాల విస్తరణకు రూ.350 కోట్లను వచ్చే మూడేళ్లలో పెడుతున్నామని తెలిపారు. తద్వారా తమ ఉత్పాదక సామర్ధ్యం 2.26 లక్షల టన్నులకు చేరుకుంటుందన్నారు. ప్రస్తుతం తమ ఉత్పాదక సామర్ధ్యం 1.52 లక్షల టన్నులు మాత్రమే అని మహదేవన్ వివరించారు.
|