మంబయి-బ్యాంకాక్‌ల మధ్య ప్రతిరోజూ విమాన సేవలను ప్రైవేటు రంగ విదేశీ విమాన సేవల సంస్థ జెట్ ఎయిర్‌వేస్ ప్రారంభించింది. భారత-థాయ్‌లాండ్‌ల మధ్య ఇది మూడో విమాన సేవలని జెట్ ఎయిర్‌వేస్ సీఈఓ ఉల్ఫోంగ్ ప్రాక్ చెప్పారు.
ముంబయి-బ్యాంకాక్ సేవలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఢిల్లీ, కోల్‌కతాల నుంచి బ్యాంకాక్‌కు గతంలో తాము విమాన సేవలను ప్రారంభించామని తెలిపారు. ముంబయి-బ్యాంకాక్‌ల మధ్య ఎకానమీ రిటర్న్ ఎయిర్‌ఫేర్స్ రూ.15,320, ప్రీమియర్ ఫేర్స్ రూ.35,115లని వివరించారు. వీటికి పన్నులు అదనమని ప్రాక్ చెప్పారు.
ఫ్లైట్ నెం9W 62 ముంబయిలో అర్ధరాత్రి 01.10 ని.లకు బయలుదేరి బ్యాంకాక్‌కు ఉదయం 06.50 ని.లకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ నెం.9W 61 బ్యాంకాక్‌లో ఉదయం 08.40 ని.లకు బయలుదేరి ముంబాయికి ఉదయం 11.45ని.లకు చేరుకుంటుంది. ఈ మార్గంలో బోయింగ్ 737-800 రకం విమానాలను జెట్ రంగంలోకి దించింది.
|