ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారతీయ రైల్వే ఆదాయం 17 శాతం వృద్ధి
భారతీయ రైల్వే ఏప్రిల్‌లో 16.73 శాతం వృద్ధితో రూ.6,420.59 కోట్లను ఆర్జించింది. ఇందులో అధిక భాగం సరుకుల రవాణా ద్వారా రైల్వే సముపార్జించింది. గత ఏడాది ఇది రూ.5,500.40 కోట్లు మాత్రమే. ప్రస్తుత ఆర్ధిక సంవత్సర తొలి మాసంలోనే భారీ లాభాలను ఆర్జించటం భారతీయ రైల్వే శాఖకు ఆనందాన్ని ఇస్తుంది. సరుకుల రవాణా విభాగంలో 19.31 శాతం వృద్ధితో రూ.4,391.55 కోట్ల మేర ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇది రూ.3,680.64 కోట్లు మాత్రమే.

ప్రయాణీకుల రాకపోకలు ద్వారా 10.97 శాతం వృద్ధితో 1,793.98 కోట్ల మేర ఆర్జించింది. గతంలో ఇది రూ.1,616.69 కోట్లు మాత్రమే. ఏప్రిల్‌లో 572.64 మిలియన్ల మంది ప్రయాణీకులు వివిధ రైళ్లలో ముందస్తు బుకింగ్ ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
మరిన్ని
ముంబయి-బ్యాంకాక్ విమాన సేవలు : జెట్
రూ.350 కోట్ల పెట్టుబడులు : హిందూజా
భారత ద్విచక్ర మార్కెట్‌లోకి డుకాటీ
కొత్త రికార్డును తాకిన చమురు ధర
పర్యాటక ప్రాంతాల ప్రచారానికి విదేశీ సంస్థలు
రిలయన్స్ పెట్రోలు పంపులు మూసివేత