టాటా కన్సల్టన్సీ సర్వీసెస్‌తో తమ సేవా నిర్వహణ కాంట్రాక్టును రెన్యూవల్ చేస్తున్నామని వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఇరవై నాలుగు గంటల సేవా డెస్క్ సహా వర్జిన్ అట్లాంటిక్ ఐటీ వ్యవస్థల నిర్వహణను టీసీఎస్ కొనసాగిస్తుంది.
బాగా పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు టీసీఎస్ భాగస్వామ్యం చక్కగా పనిచేస్తోందని వర్జిన్ అట్లాంటిక్ ఐటీ డైరక్టర్ మైక్ కోప్ తెలిపారు.
|