టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసిక లాభాలను ప్రకటించింది. 1,290.61 కోట్ల రూపాయల నికరలాభాన్ని చూపింది. గత ఏడాది ఇదే సమయానికి 1,202.93 కోట్ల రూపాయల నికర లాభాన్ని టిసిఎస్ ఆర్జించింది.
ఈ త్రైమాసికంలో నికరలాభంలో 7.3 శాతం వృద్ధి నమోదైంది. కంపెనీ ఇపిఎస్ 13.19 రూపాయలుగా ఉంది. లాభాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించారు. ఒక్కో షేరుకు మూడు రూపాయలుగా నిర్ణయించారు.
|