పశ్చిమ బెంగాల్లోని సాగర్‌ధిగి వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ అభివృద్ధి సంస్థ ఆగస్టు నుంచి విద్యుత్ వ్యాపారానికి నాంది పలకనున్నది. మొదటి యూనిట్ ట్రయిల్ సందర్భంగా విరిగి పడిని సంఘటనలో చైనా కాంట్రాక్టర్‌తో ఉన్న తకరారు ఆ సమయానికి సమసిపోతుంది.
పశ్చిమ బెంగాల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఎండి ఎస్ మహాపాత్ర మాట్లాడుతూ, విరిగిన పడిన మొదటి యునిట్ పనులు 80 శాతం పూర్తయినట్లు వివరించారు. అది కూడా త్వరలోనే ఉత్పత్తికి సిద్ధమవుతుందని తెలిపారు. ఒకటి రెండో యూనిట్ పనులు రెండు మూడు రోజుల్లో పూర్తి అవుతుందన్నారు.
రెండు యూనిట్లు కలిపి ఆగస్టు రెండో వారానికి 600 మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలవని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి నుంచి వాణిజ్య ఉత్పత్తులు ఆరంభమవుతాయని చెప్పారు. రూ. 2,750 కోట్లతో ఈ రెండు యూనిట్ల నిర్మాణానికి చైనాకు చెందిన యూపీసీ కాంట్రాక్టరు ఈ నిర్మణాలను దక్కించుకున్నారు.
|