భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా ద్రవ్యోల్బణ ఒత్తిడిలోనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. ఆర్‌బిఐ గవర్నర్ వైవిరెడ్డితో సంభాషణను ఊటంకిస్తూ పలు అంశాలను గురువారం విలేకరులకు తెలిపారు. పెరుగుతున్న ధరలను అదుపు చేయడానికి కేంద్ర సహాయం తీసుకోనున్నట్లు వివరించారు.
ఈ విషయమై తాను ఆర్‌బిఐ గవర్నర్‌ను కలిసినట్లు చెప్పారు. చర్యలు ఆరంభం అయితే సమయానుగుణంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని పేర్కొన్నారు. బ్యాంకులు పరస్పరం ఇచ్చుకునే రుణాల సీఎంఆర్ రాత్రికి రాత్రే 7 నుంచి 9.1 పెంచేశాయన్నారు.
వీటిపై పార్లమెంటరీ కమిటీ సభ్యులకు వివరించిన మీదట సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. పోయిన నెలలో స్వల్పకాలిక రుణాల కింద ఆర్‌బిఐ 0.75 శాతం పెంచింది. ప్రస్తుతం ఇది కాస్త 8.5 శాతానికి చేరుకుంది.
|