కొన్నాళ్లు పోతే సెల్ లేని ఊరు, ఫైనాన్స్ లేని వాడ ఉండదనే చెప్పాలి. కొన్నాళ్ళేందుకు ఎస్‌కెఎస్ ఫైన్సాస్ సంస్థ, ఎయిర్‌టెల్ చేతులు కలిపాయి. గ్రామీణ ప్రాంతంల్లో తమ సేవలను విస్తరించి తద్వరా మార్కెట్‌ను కైవసం చేసుకోవడానికి రంగం సిద్ధం చేశాయి. ప్రత్యేక ప్యాకేజీ రూపొందించాయి.
రూ.2000తో సెల్‌ఫోన్ అరచేతిలోకి వచ్చి కూర్చుంటుందని ఎస్‌కెఎస్ మైక్రో ఫైనాన్స్ సిఇఒ విక్రమ్, భారతి ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్ మెహరోత్రా చెపుతున్నారు. గురువారం హైదరాబాద్‌లో ప్యాకేజీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ప్రణాళిక ప్రకారం సెల్ వినియోగదారులకు ఎస్‌కెఎస్ రూ.2000 రుణంగా అందిస్తుంది. వినియోగదారులు ఆ మొత్తాన్ని తేలికపాటి వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. నోకియా సంస్థ ఆ రూ.2000లకు హ్యాండ్‌సెట్లను అందిస్తుంది. ఎయిర్‌టెల్ సంస్థ లైఫ్‌టైమ్ ప్రీపెయిడ్ సిమ్‌క్డారును ఉచితంగా అందిస్తుంది.
ఈ ప్యాకేజి కింద ఔట్ గోయింగ్ పల్స్ రేటు ఒక్క రూపాయిగా నిర్ణయించారు. ప్రణాళికను తొలుత జోగిపేట, రామాయంపేట, మెదక్, సిద్దిపేటల్లో ప్రారంభించి అనంతరం ఈ స్కీమ్‌ను రాష్ట్రం అంతటా అమలు చేస్తామని విక్రమ్ చెప్పారు.
|