ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రూ. 7500లకు చేరనున్నవృత్తి పన్ను  Search similar articles
భారత ప్రభుత్వం వృత్తిదారులపై పన్ను కత్తి విసరనున్నది. పన్ను పెంపకం రూ.2500 నుంచి రూ.7500లుకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైద్యులు, న్యాయవాదుల్లాంటి వృత్తిదారులు ఈ కోవలోకి వస్తారు. వృత్తిదారులు సంస్థల్లో పని చేస్తున్నా లేక స్వయంగా ప్రాక్టీసు చేస్తున్నా, ఈ వృత్తి పన్ను వర్తిస్తుంది.

ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకోనున్నది. రాజ్యాంగంలోని 276 నిబంధన ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనిని స్థానిక సంస్థలు, వ్యాపార సంస్థలు, రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు ఆయా పరిధిలో పని చేసే వృత్తిదారులపై విధిస్తాయి.

అయితే ప్రభుత్వం ప్రస్తుతం 276 నిబంధన సవరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. 1998లో ఒక మారు సవరించి వృత్తిదారుల పన్నును రూ. 2500గా నిర్ణయించారు. తరువాత మళ్ళీ సవరణ తీసుకురావాలనుకోవడం ఇదే ప్రథమం. పైగా ప్రస్తుతం ఉన్న పన్నుతో పోల్చుకుంటే ప్రతిపాదిత పన్ను చాలా ఎక్కువగా ఉంది.

వృత్తిదారుల నుంచి ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో తమ రాష్ట్రంలోని వృత్తిదారులపై కొత్త పన్ను విధానాన్ని మోప కూడదని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.
మరిన్ని
స్వల్పంగా పెరిగిన ద్రవ్యోల్బణం
గ్రామీణ సెల్ వాడకందారులపై ఎయిటెల్ కన్ను
త్రైమాసిక లాభాలు: రూ. 15 కోట్లతో బయోకాన్
బంగారం వెనక్కి.... సెన్సెక్స్ ముందుకు...
ఇంకా ద్రవ్యోల్బణ ఒత్తిడిలోనే... ఆర్థిక వ్యవస్థ: చిదంబరం
వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమవుతున్న సాగర్‌ధిగి పవర్ ప్లాంట్