ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
45 శాతం వృద్ధి రేటుతో సత్యం  Search similar articles
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 45 శాతం వృద్ధిరేటుతో సత్యం లాభాల బాటలో నడుస్తోంది. రూ.548 కోట్ల నికరలాభం ప్రకటించింది. గతే ఏడాది లాభం రూ. 378 కోట్లుగా ఉంది. దీంతో పోల్చినపుడు ఈ వృద్ధి రేటు సాధించింది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనపడటం కలిసొచ్చింది. ఆర్సెలర్‌ మిట్టల్‌ వంటి కొత్త ఆర్డర్లు కంపెనీకి లాభాల పంట పండించాయి. దాంతో అంచనాలను మించగలిగింది.

సత్యంకు సంబంధించి విశ్లేషకులు ఈ త్రైమాసికంలో 500-510 కోట్ల మధ్య నికరలాభాన్ని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే లాభాలను సాధించగలిగామని సత్యం చైర్మన్‌ రామలింగరాజు తెలిపారు. ఆసియా- పసిఫిక్‌, పశ్చిమాసియా మార్కెట్లలో తమ వాటాను పెంచుకోవడం వలననే ఇది సాధించగలమని వివరించారు.

ఈ దామాషాన వార్షిక రాబడి రూ.10 వేల కోట్లను దాటుతుందన్నారు. ఇది సంస్థ చరిత్రలో ఇదొక మైలురాయిగా మిగులుతుందన్నారు. బాహ్య పరిస్థితులతో నిమిత్తం లేకుండా భవిష్యత్‌ అంచనాలను కూడా సాధిస్తామన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు. తొలి త్రైమాసికంలో మూడు భారీ డీల్స్‌ను కుదుర్చుకున్న సత్యం మరో 20 డీల్స్‌ విషయంలో మంతనాలు జరుపుతున్నట్టు ఆయన చెప్పారు.
మరిన్ని
ఒప్పందానికి గండి కొట్టేందుకు కుట్ర జరుగుతోంది
రూ. 7500లకు చేరనున్నవృత్తి పన్ను
స్వల్పంగా పెరిగిన ద్రవ్యోల్బణం
గ్రామీణ సెల్ వాడకందారులపై ఎయిటెల్ కన్ను
త్రైమాసిక లాభాలు: రూ. 15 కోట్లతో బయోకాన్
బంగారం వెనక్కి.... సెన్సెక్స్ ముందుకు...