వేసవి తాపంలో ఎమిరేట్స్ విమానయాన సంస్థ చెన్నై నుంచి వచ్చే ప్రయాణిలకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించింది. దుబాయ్ సమ్మర్ సర్‌ప్రైజ్ అనే ఈ ప్యాకేజి 22 ఆగస్టు, 2008 వరకు అమలులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. ప్రత్యేక రాయితీలతో ప్రయాణికులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ఈ ప్యాకేజి కింద ప్రయాణికులు అక్కడ జాబితాలో కోరుకున్న సముద్ర తీర హోటల్ సూట్‌లో విడిది చేసే అవకాశం ఉంది. మూడు రాత్రిళ్ళు, నాలుగు పగుళ్ళు ఉండవచ్చు. ఈ ప్యాకేజి కింద ప్రయాణించడానికి రూ.29,798 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రిటర్న్ టికెట్టు కూడా ఉంటుంది.
సాధారణంగా దుబాయ్‌లో షాపింగ్ ఫెస్టివల్ ఏర్పాటు కానున్నది. ఈ ఫెస్టివల్ కనీసం పదివారాలపాటు జరుగుతుంది. ఇందులో భాగంగానే ఎమిరేట్స్ ఈ ప్యాకేజిని ప్రకటించింది. అక్కడి గదుల్లో విడిది చేసినందుకు రాయితీ కూడా ఉంటుంది. దీనిపై ఓచర్లు ఇస్తారు. వీటిని షాపింగుల్లో వినియోగించవచ్చు. టికెట్లు స్థానిక కార్యాలయంలోగానీ, ట్రావెల్ ఏజెంట్ల వద్ద అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు చెప్పారు.
|