ఆదాయపన్ను శాఖ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఫామ్-16తో పనిలేదని ప్రభుత్వం ప్రకటించింది. అనుబంధ ఫారాలతో ఎటువంటి పనిలేదని పేర్కొంది. కేవలం టీడీఎస్ లేదా టీసీఎస్‌లు మాత్రం జతపరిస్తే సరిపోతుందని అధికార వర్గాలు చెప్పాయి.
అలా ఎవరైనా ఫామ్-16 జత చేస్తే అధికారులు వాటిని తొలగించాలని అధికాలకు సూచింది. అధికారులు అడిగినపుడు అసలు నఖళ్లు చూపించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. టిడిఎస్ లేదా టిసిఎస్‌లు చెల్లింపుల ప్రకారం అనుమతిస్తారని వివరించారు. పరిశీలన తరువాత టీడీఎస్ క్లైం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
టీడీఎస్, టీసీఎస్ సర్టిఫికెట్లు లేవన్న కారణంగా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలును తిరస్కరించాడానికి లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇన్‌కమ్‌టాక్స్ చెల్లించే వారు ఎలక్ట్రానిక్ మోడ్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటనలో తెలిపారు. అయితే ట్రస్ట్(ఐటిఆర్-7)ల విషయంలో ఇది వర్తించదని స్పష్టం చేశారు.
|