భారతీయ రైల్వే ప్రస్తుత ఆర్ధిక సంవత్సర తొలి త్రైమాసిక కాలంలో 18.04 శాతం వృద్ధితో లాభాలు గడించింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.19,549.29 కోట్లు ఆర్జించింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే సమయానికి రూ.16,561.44 కోట్ల లాభాలు స్వీకరించింది. సరుకు రవాణాలో 22.05 శాతం వృద్ధితో రూ.13,470.11 కోట్లు గడించింది. గత ఆర్ధిక సంవత్సర ఇదే సమయంలో రూ.11,036.23 కోట్ల లాభాలు వచ్చాయి. ప్రయాణీకుల రాకపోకల్లో 9.96 శాతం వృద్ధితో రూ.5,342.17 కోట్ల లాభాలు వచ్చాయి. గత ఆర్ధిక సంవత్సరంలో ఇది రూ.4,858.07 కోట్లుగా ఉంది.
భారతీయ రైల్వే పరిధిలో నడిచే వివిధ రైళ్లలో 1,739.33 మిలియన్లు మంది ప్రయాణీకులు రిజర్వేషన్ చేయించుకుని తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. గత ఏడాది ఇది 1,649.04 మిలియన్లు మంది మాత్రమే. ఇది 5.48 శాతం వృద్ధి. అర్బన్, సబర్బన్ సేవలను వరుసగా 916.22 మిలియన్లు, 823.11 మిలియన్ల మంది ప్రయాణీకులు వినియోగించుకున్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో ఇది వరుసగా 883.45 మంది, 765.59 మిలియన్లుగా ఉంది.
|