ప్రపంచ దేశాలను వణికించిన ముడి చమురు ధర ఆసియా మార్కెట్‌లో బుధవారం తగ్గుముఖం పట్టింది. చమురు ధర మూడు డాలర్లు మేర తగ్గి ప్రస్తుతం 127 డాలర్లు వద్ద నిలిచింది. అమెరికాలో చమురు ధరలు తగ్గుముఖం పట్టిందని వచ్చిన వార్తలు ఆసియా మార్కెట్‌లకు ఉత్సాహాన్ని ఇచ్చింది.
చమురు ధరలు గతంలో ఎప్పుడూ లేనివిధంగా గత ఆరు నెలల కాలంలో గరిష్టంగా 147 డాలర్లకు చేరుకుని ప్రపంచ దేశాల్లో గుబులును రేపింది. దీనితో ఒపెక్‌పై ఒత్తిడి పెరిగింది. హరికేన్ దాడి వల్ల గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం వెంట అమెరికా చమురు కేంద్రాలకు నష్టం కలుగుతాయని వార్తలు వచ్చాయి.
ప్రపంచ దేశాల ఆర్ధిక రంగాలపై పెరుగుతున్న చమురు ధరలు ప్రభావాన్ని చూపాయి. తద్వారా ఆహార పదార్ధాల ధరలు పెరిగి అక్కడి సామాన్య ప్రజానీకం అనేక అష్టకష్టాలు పడ్డారు. తగ్గిన చమురు ధరలు ఆయా దేశాలకు కొంతవరకు స్వాంతన కల్గించాయి.
|