రూ.95 ఛార్జీలతో ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తూ వరల్డ్ ఫోన్ ఇంటర్నెట్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తొలుత దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టింది.
ముంబయి, జైపూర్, అహ్మదాబాద్, హైదరాబాద్, కొల్‌కత సహా పలు ముఖ్య నగరాల్లో ఈ నెట్ ప్యాకేజీని త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఇందు కోసం కేబుల్ ఆపరేటర్లతో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. నిముషానికి 256 కేబీ వేగంతో ఈ నెట్ పనిచేయగలదని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. 200 ఎంబీ డేటాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి.
|