నెటవర్కింగ్ పరికరాల ఉత్పత్తిలో ఆసియా, పసిఫిక్ దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న రెండో అతి పెద్ద కంపెనీ జునిపర్ నెటవర్క్స్ సంస్థ భారత్‌లో భారీగా పెట్టుబడులను పెట్టనుంది. సుమారు 400 మిలియన్ డాలర్‌ల మేర పెట్టుబడులను పెట్టి తద్వారా భారత్‌లో సంస్థ కార్యకలాపాలను కూడా విస్తృతం చేయాలని జునిపర్ సంస్థ నిర్ణయించింది.
ఈ పెట్టుబడిని పరిశోధన, ఇంజినీరింగ్, స్విచ్చింగ్ ప్రాడక్ట్స్, భద్రతకు సంబంధించిన పరికరాలు తదితర ఉత్పత్తులను చేపట్టేందుకు ఖర్చు చేయనుంది. దేశంలోని ముంబాయి, చెన్నై, ఢిల్లీ, మరియు ఇతర కీలక నగరాలకు తమ సంస్థ సేల్స్ టీమ్‌ను వృద్ధి చేయాలని అనుకుంటున్నట్లు జునిపర్ సంస్థ ఆసియా, పసిఫిక్ సీనియర్ ఉపాధ్యక్షుడు ఆడమ్ జడ్ తెలిపారు.
బెంగుళూరులో సోమవారం విలేకరులతో ఆడమ్ మాట్లాడుతూ భారత్‌లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) సొల్యూషన్స్ మార్కెట్‌పై దృష్టి సారించామన్నారు. ఇప్పటికే త్వరితగతిన వృద్ది చెందుతున్న టెలికాం సర్వీసు ప్రొవైడర్లు భవిష్యత్తులో నెటవర్కింగ్ మౌలికసదుపాయాల ఆవశ్యకత ఉందని.. దీని వల్ల ఐపీ సొల్యూషన్స్ మార్కెట్‌లో మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.
గడచిన మూడేళ్లలో జునిపర్ ఇండియా 200 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా... దాదాపు 1,250 మందికి ఉద్యోగావకాశాలను కూడా తమ సంస్థ కల్పించినట్లు ఆడమ్ వివరించారు.
|