ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > చెన్నైలో జరుగనున్న రీటైల్ సదస్సు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చెన్నైలో జరుగనున్న రీటైల్ సదస్సు
చిల్లర వ్యాపారాన్ని (రీటైల్ మార్కెటింగ్) ప్రోత్సహించేందుకు దక్షిణ భారత వాణిజ్య, పరిశ్రమల మండలి (సిక్కీ) ఈ నెల ఐదు, ఆరు తేదీల్లో రిటైల్ సదస్సును నిర్వహించనుంది. "ఎమర్జింగ్ రిటైల్ పారడిగమ్" అనే పేరుతో నిర్వహించే ఈ సదస్సు చెన్నైలోని తాజ్ కోరమండల్‌లో జరుగనుంది. సదస్సు నిర్వహణపై నిర్వాహకులు సోమవారం రాత్రి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. సదస్సును టైటాన్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ భట్ చేతుల మీదగా ఐదో తేదీ ప్రారంభమవుతుందని చెప్పారు.

కోక్ ఇండియా, హెంకెల్, హెచ్ఎస్‌బీసీ, ఫరీదా గ్రూపు, ఈటీఏ స్టార్, మురగప్పా గ్రూపు తదితర సంస్థలు ఈ సదస్సుకు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయని వివరించారు. మర్చంటైజింగ్, స్టోర్ ఆపరేషన్స్, షాపర్ మార్కెటింగ్ అండ్ ఇన్‌స్టోర్స్ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరుగుతాయి. అనంతరం సిక్కీ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం ఈ సదస్సుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

రిటైల్ పరిశ్రమ అవసరాలను గుర్తించడానికి ఇదే సరైన సమయమన్నారు. చెన్నైలో తొలిసారి నిర్వహించే ఈ సదస్సు విజయవంతమైన పక్షంలో ప్రతిఏటా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామన్నారు. ఇలాంటి సదస్సును రాష్ట్రంలో నిర్వహించడం ఇదే తొలిసారని ఆయన వివరించారు.
మరిన్ని
మారిషస్‌లో శంకర్ నేత్రాలయ కొత్త కేంద్రం
ఆర్బీఐ పీఠంపై మళ్లీ మన 'తెలుగు తేజం'
భారత్‌లో భారీ పెట్టుబడి పెట్టనున్న జునిపర్
ధరలపై ఉక్కు ఉత్పత్తి సంస్థలతో ప్రభుత్వం చర్చలు...!
రూ.95కే ఇంటర్నెట్ సదుపాయం
పెరిగిన 'స్పైస్‌జట్' ఆపరేటింగ్ ఆదాయం