యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఎయిర్ అరేబియా విమానయాన సంస్థ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, షార్జాల మధ్య రోజు వారి సర్వీసులను నడుపనుంది. ఈనెల 27వ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రారంభించనున్నట్టు ఎయిర్ అరేబియా ప్రకటించింది. ప్రస్తుతం అహ్మదాబాద్, బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూరు, జైపూర్, కోచ్చి, కోళికోడ్, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, విశాఖపట్నంలకు డైరక్టు సర్వీసులు నడుపుతోంది.
తాజాగా హైదరాబాద్-షార్జాల మధ్య డైరక్టు సర్వీసులు విమానాలు నడుపనుంది. ఇది ఎయిర్ అరేబియాకు 43వ డెస్టినేషన్ కాగా, భారత్‌లో 12 డెస్టినేషన్ ప్రాంతం. షార్జా-హైదరాబాద్‌ల మధ్య ప్రతి రోజు ఈ విమాన సర్వీసు నడుపుతారు. ఈ విమాన సర్వీసు సమయాలను తర్వాత వెల్లడిస్తామని ఎయిర్ అరేబియా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
|