భారత్- జర్మనీ దేశాల మధ్య వాణిజ్యం క్రమంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఏడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యం రూ.89,600 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని జర్మనీలోని భారత దౌత్యవేత్త రోలండ్ హెర్మెన్ బుధవారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత ఏడాది ఈ ఇరు దేశాల మధ్య రూ.76,800 కోట్ల వ్యాపారం జరిగిందని చెప్పారు. ఈ ఏడాది ఆధునిక యంత్రాలు, దుస్తులు ఉత్పత్తి చేసే కొత్త పరిజ్ఞానంతో కూడిన యంత్రాలను జర్మనీకి భారత్ ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
|