ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > అమెరికా సంస్థతో డా. రెడ్డీస్ ఒప్పందం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అమెరికా సంస్థతో డా. రెడ్డీస్ ఒప్పందం
దేశంలో ప్రముఖ మందుల ఉత్పత్తి సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ కంపెనీ... అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న చర్మ సంబంధిత మందుల ఉత్పత్తి సంస్థ కాస్మెడెర్మ్ టెక్నాలజీస్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌లో చర్మ రక్షణ మందుల పంపిణీని ఇరు సంస్థలు సంయుక్తంగా చేపట్టనున్నాయి.

వైవిధ్యమైన ఇలాంటి మందులను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెడితే... భవిష్యత్తులో సంబంధిత విభాగంలో ఈ ఉత్పత్తులు అగ్రపథాన నిలుస్తాయని అంచనా వేస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ కంపెనీ బ్రాండెడ్ ఫార్ములేషన్ గ్రూప్ అధ్యక్షుడు జస్మాల్ సింగ్ రాణా తెలిపారు. రెఫినిటీ మరియు కాస్మెడెర్మ్ పీల్ కిట్స్ వంటి రెండు రకాల ఉత్పత్తుల కోసం అమెరికా కంపెనీతో భాగస్వామ్యం చేసుకున్నామన్నారు.

ఈ ఉత్పత్తులు 70 శాతం మరియు 50 శాతం మేర గ్లైకొలిక్ యాసిడ్‌ను కలిగి ఉన్నాయని... దీని వల్ల చర్మపు కాంతి మెరుగుపడటమే కాకుండా... గొంతు... మొహంలో ప్రకాశవంతమైన మెరుపు వంటివి వస్తాయని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌కు డాక్టర్ రెడ్డీస్ సంస్థ పంపిన ఫైలింగ్‌లో పేర్కొనబడి ఉంది.

ఈ రెండు రకాల మందుల్లో గ్లైకోలిక్ యాసిడ్‌ ఉపయోగించి ఉన్నందున చర్మంపై ముడుతలు, మచ్చలు... తొలగిపోతాయని డాక్టర్ రెడ్డీస్ సంస్థ తెలిపింది. డెర్మటాలజీ విభాగపు మార్కెట్‌లో ఈ మందుల ప్రభావంతో భవిష్యత్తులో బలమైన సంస్థగా తాము ఎదుగుతామని డాక్టర్ రెడ్డీస్ కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
మరిన్ని
నిర్ణీత గడువులోగా నానో కారు: రతన్ టాటా
రూ.89,600 కోట్లకు చేరుకున్న భారత్-జర్మనీ వాణిజ్యం
హైదరాబాద్‌కు ఎయిర్ అరేబియా విమాన సర్వీసులు
చెన్నైలో జరుగనున్న రీటైల్ సదస్సు
మారిషస్‌లో శంకర్ నేత్రాలయ కొత్త కేంద్రం
ఆర్బీఐ పీఠంపై మళ్లీ మన 'తెలుగు తేజం'