అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా దేశీయంగా పసిడి ధరలు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. రెండు మూడు నెలల క్రితం ఆకాశాన్ని తాకిన ఈ ధరలు పండగ సీజన్లలో మరింతగా కొండెక్కడం సహజం. అయితే ప్రపంచ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాల వల్ల వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి.
దేశ వాణిజ్య రాజధాని ముంబై మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 25 రూపాయల మేరకు తగ్గి రూ.11,770 వద్ద సాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,710గా పలుకుతోంది. అలాగే వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికే 480 రూపాయల మేరకు తగ్గి 20,525 వద్ద కొనసాగుతోంది.
ఇకపోతే సింగపూర్ మార్కెట్‌లో కూడా బంగారు ధరలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తాజాగా ఇక్కడ తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇకపోతే అగ్రరాజ్యం అమెరికా మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే.. గత నాలుగు రోజులుగా కోలుకున్న అమెరికా మార్కెట్ ప్రస్తుతం 800 డాలర్లను తాకింది.
|