ఆసియాలో అత్యుత్తమ ప్రతిభా సామర్థ్యాలు కలిగిన 50 సంస్థల జాబితాలో భారత్ సంస్థలు స్థానం సంపాదించుకున్నాయి. ప్రముఖ వాణిజ్య పత్రిక బిజినెస్ వీక్ విడుదల చేసిన ఈ జాబితాలో స్వదేశీ సంస్థలయిన సీమన్స్ ఇండియా, యునిటెక్‌లు అగ్రస్థానంలో నిలిచాయి.
ఈ జాబితాలో భారత సంస్థలు డీఎల్‌ఎఫ్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఐటీసీ సంస్థలు సహా మొత్తం 10 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. కాగా, ఈ జాబితాలో చైనా 8 సంస్థలు, హాంకాంగ్ 6 సంస్థలతో జాబితాలో నిలిచాయి.
జర్మనీకి చెందిన కాంగ్లొమెరేట్ సీమన్స్ ఏజీకి చెందిన స్వదేశీ యూనిట్ సీమన్స్ ఇండియా మొదటి స్థానంలో నిలువగా, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ యునిటెక్ రెండో స్థానం దక్కించుకుంది. కాగా, ఈ జాబితాలో టాప్ 20 స్థానాల్లో భారత్‌కు చెందిన ఏడు సంస్థలు నిలిచాయి. సిప్లా 6వ స్థానంలో, ఏబీబీ ఇండియా 12వ స్థానంలో, టెక్ మహీంద్రా 13వ స్థానంలోనూ నిలిచాయి.
తర్వాతి స్థానాలను చైనాకు చెందిన అలీబాబా.కామ్, చైనా మాలిబ్డెనం, జపాన్‌కు చెందిన ఇన్‌పెక్స్ హోల్డింగ్స్ ఆక్రమించుకున్నాయి. అలాగే, హిందుస్థాన్ జింక్ 17వ స్థానంలో, డీఎల్ఎఫ్ 18వ స్థానాలను ఆక్రమించుకున్నాయి. ఈ జాబితాలోని మిగిలిన సంస్థలు భెల్ 27వ స్థానంలో, ఐటీసీ 45వ స్థానంలో, టీసీఎస్ 50వ స్థానంలోనూ నిలిచాయి.
|