విదేశీ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌కు శనివారం మంచి డిమాండ్ ఏర్పడటంతో డాలర్‌తో రూపాయి మారక విలువ 29 పైసల మేర పడిపోయింది. స్టాక్ మార్కెట్ బలహీనపడటం కూడా డాలర్ విలువ పెరిగేందుకు దోహదపడింది.
శుక్రవారమే కొద్ది విరామం తర్వాత డాలర్ విలువ పెరగడం ప్రారంభించిందని ఫోరెక్స్ డీలర్లు తెలిపారు. ఆసియా మార్కెట్‌లన్నీ బలహీనపడటంతో లావాదేవీలు అటు, ఇటుగా సాగుతూరావడం ప్రారంభించాయన్నారు.
వారం ప్రారంభంలో 44.50/60ల వద్ద ప్రారంభమైన డాలర్ మారక విలువ 44.28- 44.74 శ్రేణిలో వారం పూర్తిగా కొనసాగింది. శుక్రవారం 44.35/36వద్ద నిలిచింది. ఎగుమతిదారులు, దిగుమతిదారులు వారం చివరికల్లా తమ డబ్బును డాలర్ రూపంలోకి మార్చుకున్నారని వ్యాపార వర్గాలు తెలిపాయి.
|