హెచ్ వన్ బీ వీసాలను క్రమబద్ధీకరించనున్నట్టు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న బారక్ ఒబామా ప్రకటించారు. అమెరికాలోని ఉద్యోగ వ్యవస్థతో విదేశీయులు చెలగాటమాడకుండా దీనిని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
పెన్సిల్వేనియాలోని దుర్యియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ హెచ్ వన్ బీ వీసాలు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీయులు ఆమెరికాలోని వారి ఉద్యోగ సంస్థ అవసరం కోసం రావాల్సి ఉంటే మాత్రమే ఉపయోగపడాల్సిన కార్యక్రమమనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలన్నారు.
ఇది అత్యుత్తమ స్థాయి నిపుణులకు మాత్రమే వర్తించేవని చెప్పారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఉండగా, భారత్ నుంచి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను రప్పించడం దురదృష్టకరమన్నారు. తక్కువ జీతాల పేరుతో వారిని రప్పించడం ద్వారా అమెరికాలోని లేబర్ మార్కెట్, వేతనాలలో కూడా కోత పడుతోందని చెప్పారు.
|