ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > సింగూర్ ఫార్ములాపై 'టాటా' అసంతృప్తి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సింగూర్ ఫార్ములాపై 'టాటా' అసంతృప్తి
వివాదాస్పద సింగూర్ సమస్య పరిష్కారం కోసం బెంగాల్ ప్రభుత్వం-తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య ఏర్పడిన ఒప్పందం పట్ల టాటా యాజమాన్యం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు పనులను ప్రారంభించబోమని ప్రకటించింది. తాజాగా ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు అధికంగా టాటా యాజమాన్యం నష్ట పోవాల్సి ఉంటుంది. ఆ కారణంగా నానో కార్ల ప్రాజెక్టు పనులను పునరుద్ధరించే విషయంపై యాజమాన్యం ఆచితూచి అడుగులు వేస్తోంది.

దీనిపై టాటా మోటార్ సంస్థ సోమవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం రాత్రి ప్రభుత్వం-తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ సమక్షంలో కుదిరిన సయోధ్యా ఒప్పందం పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు పేర్కొంది. ఈ ఒప్పందంలో పలు అంశాలు స్పష్టత లేకుండా ఉన్నాయని తెలిపింది.

అందువల్ల వీటిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లభించేంత వరకు నానో కార్ల ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా ఆపివేస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా ప్రాజెక్టు ఏరియాకు వెయ్యి ఎకరాల లోపల భూమిని తిరిగి ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించబోదని అందులో స్పష్టం చేసింది.

సింగూర్ సమస్య పరిష్కారానికి బెంగాల్ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ మధ్యవర్తిగా బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీల మధ్య సయోధ్య ఒప్పందం కుదిరిన విషయం తెల్సిందే. ఈ ఒప్పందం మేరకు నష్టపరిహారాన్ని తిరస్కరించే వారికి తిరిగి భూములను అప్పగించాలని నిర్ణయించారు.
మరిన్ని
సలోరా గ్రూప్ రీటైల్ ఔట్‌లెట్‌లు
హెచ్ వన్ బీ వీసాల క్రమబద్ధీకరణ: ఒబామా
బలహీనపడిన రూపాయి
టాప్ 50 అత్యుత్తమ కంపెనీల్లో భారత్ సంస్థలు
పెట్రోభారం ఇప్పట్లో తగ్గించం: మురళీ దేవరా
దేశీయంగా తగ్గుతున్న పసిడి ధరలు