ఆర్థిక సంక్షోభం జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులపై మరోసారి విరుచుకుపడింది. మొన్నామధ్య ఏకంగా తమ ఉద్యోగాలకు ఎసరుపెట్టిన ఈ ఉపద్రవం తాజాగా వారి జీతాల్లో కోతను నిర్దేశిస్తోంది. ఫలితంగా జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగుల జీత భత్యాలలో 5 నుండి 25 శాతం వరకు కోత విధింపు అమలుకానుంది. జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం, ఎయిర్ లైన్స్ అధికారుల మధ్య జరిగిన చర్చలో పైలెట్లు మరియు ఇంజనీర్లు పాల్గొన్నారు. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా గత నెలలో 1900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. అయితే ఉద్యోగుల సమ్మె, రాజ్ థాకరే వంటి నాయకులు, ప్రభుత్వం ఒత్తిడి మేరకు దిగివచ్చిన జెట్ ఎయిర్‌వేస్ తిరిగి వారిని విధుల్లోకి తీసుకుంది. |