ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > ఉద్యోగాలున్నాయి... రండి: సిటీ బ్యాంక్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఉద్యోగాలున్నాయి... రండి: సిటీ బ్యాంక్
వినడానికి ఇది విడ్డూరంగానే ఉంది కదూ... పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సిటీ బ్యాంక్ తమ వద్ద వందకు మించి ఉద్యోగాలున్నాయనీ, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని గతవారం ప్రకటన ఇచ్చింది. అదే సమయంలో సుమారు 50వేల మందికి ఉద్వాసన పలుకనున్నట్లు సంచలన ప్రకటన చేసింది.

అధిక జీతభత్యాలను తీసుకుంటూ బ్యాంకుకు గుదిబండలా మారిన మేనేజర్ స్థాయి ఉద్యోగులను తప్పించి ఆ స్థానంలో కొత్త ఉద్యోగులను నియమించాలన్నదే సిటీ బ్యాంక్ అభిమతంగా తెలుస్తోంది.

ఈ క్రమంలో బ్యాంకు తమ వెబ్ సైట్‌లో..." ప్రతిభావంతులైన వారికోసం సిటీ బ్యాంక్ ఎదురుచూస్తోంది. 109 ఉద్యోగాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి. నిరంతరాయ కెరీర్... అత్యున్నత శిఖరాలకు చేరాలనుకుంటున్నారా...? అయితే సిటీ బ్యాంక్ మీకు ఆ అవకాశం ఇస్తోంది."... ఇత్యాది ప్రకటనలను పొందుపరిచింది.

కాగా గత ఏడాది సిటీ బ్యాంక్‌లో సుమారు 3 లక్షల 75 వేల మంది ఉద్యోగులున్నారు. ఈ సంఖ్యను 3 లక్షలకు కుదించాలని బ్యాంక్ లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా 25వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. మిగిలిన 75వేల మంది ఉద్యోగులకు దశలవారీగా ఉద్వాసన పలకాలని బ్యాంక్ యోచన చేస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సిటీ బ్యాంకుకు అమెరికా ప్రభుత్వం సాయం
జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులకు జీతాలలో కోత
ఆర్థిక సంక్షోభంతో 22 అమెరికా బ్యాంకులు క్లోజ్
యూరప్-ఆసియా మధ్య వారధి టర్కీ: సిబాల్
ఎనిమిది శాతం వృద్ధిరేటు సాధిస్తాం: ప్రధాని హమీ
'బీ రెడీ' ప్రచారాన్ని ప్రారంభించిన అమృతాంజన్