ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > ఒబామా ఆర్థిక మంత్రిలో భారతీయ మూలాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒబామా ఆర్థిక మంత్రిలో భారతీయ మూలాలు
ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కోశాగారాన్ని నడిపేందుకు ఒబామా భారత దేశంలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన వ్యక్తిని ఎంచుకోవడం విశేషం. ఇప్పటికే తన విధాన బృందంలో నలుగురు భారత సంతతి అమెరికన్లకు చోటు కల్పించిన ఒబామా అమెరిరా నూతన ఆర్థిక మంత్రిగా టిమోతీ గైట్నర్‌ను ఎంచుకున్నారు.

ప్రస్తుతం న్యూయార్క్ ఫెడరల్ రిజర్వు బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్న టిమోతీ భారత రాజధాని ఢిల్లీలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. తర్వాత అనేక ఆసియా నగరాలలో జీవించిన టిమోతీ తన డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికాకు తిరిగి వచ్చారు. తన తండ్రి హార్వార్డ్ యూనివర్శిటీలో ఆసియా సెంటర్‌కి సలహాదారుగా ఉంటున్నారు. ఇంకా ఆసియా పసిఫిక్ ఫిలాంత్రపీ కన్సోర్టియం, రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్, శశాకవా పీస్ పౌండేషన్ వంటి పలుసంస్థలకు కన్సల్టెంట్‌గా కూడా ఉంటున్నారు.

అలాగే అమెరికా చైనా సంబంధాలపై జాతీయ కమిటీ సభ్యుడిగా, సెంటర్ ఫర్ ది అడ్వాన్స్‌డ్ స్టడీ ఆఫ్ ఇండియా సంస్థ సభ్యుడిగా ఉన్న టిమోతీ తండ్రి గత 28 ఏళ్లుగా ఫోర్ట్ ఫౌండేషన్‌ కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు. పైగా భారత్‌లో డిప్యూటీ ప్రతినిధిగా, నేపాల్, శ్రీలంక దేశాలలో ఫౌండేషన్ ప్రతినిధిగా పలు బాధ్యతలను టిమోతీ తండ్రి నిర్వహించారు.

ఆసియా, భారతీయ మూలాలను కలిగి ఉన్న టిమోతీ గైట్నర్ అమెరికా నూతన ఆర్థిక కార్యదర్శిగా నియమించబడటం మన ప్రయోజనాలకు ఉపయోగకారిగా ఉంటుందని భారతీయ ప్రముఖులు పేర్కొంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఎయిర్ ఇండియా ఛార్జీల తగ్గింపు!
భారత్ పరిస్థితి ఆశాజనకమే : చిదంబరం
ఉద్యోగాలున్నాయి... రండి: సిటీ బ్యాంక్
సిటీ బ్యాంకుకు అమెరికా ప్రభుత్వం సాయం
జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులకు జీతాలలో కోత
ఆర్థిక సంక్షోభంతో 22 అమెరికా బ్యాంకులు క్లోజ్