గత రెండు సవంత్సరాలుగా బ్రిటన్‌లో దేశీయ పౌరుల కంటే విదేశాలనుంచి వలస వచ్చిన కార్మికులే అధికంగా ఉద్యోగాలు సాధించారని అధికార గణాంకాలు తెలిపాయి. ఈ రెండేళ్ల కాలంలో 5 లక్షల మంది విదేశీ కార్మికులు బ్రిటన్‌లో ఉద్యోగాలు సాధించగా, బ్రిటిష్ పౌరులు ఇదే కాలంలో కేవలం 1,49,000 ఉద్యోగాలు మాత్రమే దక్కించుకోగలిగారు.
బ్రిటన్‌లో యువ విదేశీ కార్మికులు, 50 సంవత్సరాలు పైబడిన దేశీయ పౌరులకంటే సగటున అధికంగా సంపాదిస్తున్నారని అధికార గణాంకాల బట్టి తెలుస్తోంది. లేబర్ పార్టీ ప్రభుత్వ హయాంలో రికార్డు స్థాయిలో అయిదు రెట్లకు మించి విదేశీ కార్మికులు బ్రిటన్ తరలి వచ్చారని గణాంకాలు చెబుతున్నాయి. విదేశీ కార్మికులు భారీ స్థాయిలో తరలి రావడంతో బ్రిటన్‌లో గ్రామీణ కమ్యూనిటీలు తమ ఉనికి కోసం పోరాడుతున్నాయని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చారిటీ సంస్థ తెలిపింది.
2006 సెప్టెంబర్ నుంచి 2008 సెప్టెంబర్ వరకు బ్రిటన్‌లో 3,20,000ల దాకా ఉద్యోగాలు పెరిగాయి అంటే రెండేళ్ల కాలంలో ఉద్యోగాలలో పెరుగుదల 29.17 శాతానికి చేరింది. అయితే ఈ కాలంలో బ్రిటన్ దేశీయ కార్మికులకు 1,49,000 ఉద్యోగాలు మాత్రమే లభించగా, వలస కార్మికులకు 2,69,000 ఉద్యోగాలు లభించడం గమనార్హం. |