నగరంలోని ఇన్ చెన్నయ్ హోటల్‌లో ఆంధ్ర వంటకాలతో కూడిన గోదావరి రెస్టారెంట్‍ను ప్రారంభించారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఆంధ్ర వంటకాలతో ఈ రెస్టారెంట్ రూపుదిద్దుకుంది. మన రాష్ట్రానికి చెందిన టి.విజయ్ కుమార్ అనే పారిశ్రామికవేత్త.. 14 సంవత్సరాలు విదేశాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర విదేశాల్లో నివశించి స్వదేశానికి వచ్చారు. ఆయన కలల సాకారమైన పయనీర్ సర్వీస్డ్ అపార్ట్‌మెంట్‌ను నాలుగేళ్ళ క్రితం నిర్మించారు. తన కలలో భాగంగా.. ఇన్ చెన్నయ్ హోటల్‌ను ప్రారంభించి, అందులో గోదావరి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్‌లో కేవలం ఆంధ్ర వంటకాలే కాకుండా.. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పొడులు, పచ్చళ్ళు, వేపుళ్లు, తదితర నోరూరించే వంటకాలు ఇందులో చోటు చేసుకున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో రూఫ్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన గోదావరి రెస్టారెంట్ ప్రత్యేకంగా మన రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింభించే విధంగా రూపొందించారు. ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా టి.విజయ్ కుమార్ మాట్లాడుతూ.. చెన్నయ్ నగరంలో తెలుగు వారు ముఖ్యంగా.. టి.నగర్, కోడంబాక్కం, తేనంపేట, ట్రిప్లికేణి తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలు నివశిస్తున్నారన్నారు. వీరికి మన సంప్రదాయ వంటకాలు అందించేందుకు ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. |