ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > భారత్ కాఫీ ఉత్పత్తుల ఎగుమతులు తగ్గుముఖం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత్ కాఫీ ఉత్పత్తుల ఎగుమతులు తగ్గుముఖం
భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి చేసే కాఫీ ఉత్పతులు గత ఆర్ధిక సంవత్సరంలో 4.31 శాతం మేర తగ్గుముఖం పట్టింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు 2.9 శాతం మేర పడిపోయింది. 2007-08 ఆర్ధిక సంవత్సర నవంబరు-అక్టోబరు మధ్య కాలంలో భారతదేశం నుంచి కాఫీ ఎగుమతులు 1.7 మిలియన్ల బ్యాగులు మేర మాత్రమే జరిగిందని అంతర్జాతీయ కాఫీ సంస్థ వెబ్‌సైట్‌లో తెలిపింది. కాఫీ ఎగుమతులు విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది.

అగ్రస్థానంలో ఉన్న బ్రెజిల్ 4.17 శాతం మేర పడిపోయి 24.58 మిలియన్ల బ్యాగులు ఎగుమతులు చేయగా, టాంజానియా 7.82 శాతం నష్టంతో 742,608 బ్యాగులు, కామెరూన్ 23.13 శాతం నష్టపోయి 566, 383 బ్యాగులు ఎగుమతి చేసింది. మరోవైపు కాఫీ ఎగుమతులు చేసే చిన్న దేశాలైన పపువా న్యూ గినియా, ఉగాండా, ఇండోనేషియాలు 36 శాతం వృద్ధిని సాధించాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధితో 131 మిలియన్ల బ్యాగుల కాఫీ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ కాఫీ సంస్థ అంచనా వేసింది. మరోవైపు 2008లో కాఫీకి డిమాండ్ 128 మిలియన్ బ్యాగులకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆర్థికాభివృద్ధికి ఢోకా లేదు: చిదంబరం హామీ
అమెరికాలో నమోదైన భారతీయ షేర్ల పతనం
ఉగ్రవాద దాడులతో రూ. 4 వేల కోట్లు నష్టం
ఉగ్రవాదుల బందీలుగా వాణిజ్యవేత్తలు?
'ఇన్ చెన్నయ్‌'లో ఆంధ్రా రెస్టారెంట్
సింగపూర్ ప్రధాని వేతనంలో కోత